Arekapudi Gandhi : అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

by Sridhar Babu |   ( Updated:2024-02-03 13:23:34.0  )
Arekapudi Gandhi  : అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
X

దిశ, శేరిలింగంపల్లి : అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ. 2 కోట్ల 30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,

సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed