నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వైపు భారీగా తరలివస్తున్న వినాయక విగ్రహాలు

by Mahesh |   ( Updated:2024-09-17 09:29:00.0  )
నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వైపు భారీగా తరలివస్తున్న వినాయక విగ్రహాలు
X

దిశ, బేగంపేట: ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి గణనాథులు భారీగా తరలివస్తున్నారు మంగళవారం ఉదయం నుండే ట్యాంక్ బండ్ వైపు బారులు తీరారు. ఇండ్లలో కొలువుదీరిన గణనాథులను మధ్యాహ్నం 12 గంటల వరకు కుటుంబ సమేతంగా సొంత వాహనాలపై ఊరేగిస్తూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నార్త్ జోన్ సెంట్రల్ జోన్ పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి క్రేన్ వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్ తో పాటు మహిళా కానిస్టేబుల్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త చెదారన్ని తొలగిస్తున్నారు. ఇప్పటికే అప్పర్ ట్యాంక్ బండ్ పై భక్తులు భారీ సంఖ్యలో కొలువుదీరారు.

Advertisement

Next Story