- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దిశ, సికింద్రాబాద్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో ఏబీవీ ఫౌండేషన్, ఎన్టీపీసీ సహకారంతో ఏర్పాటు చేసిన హై ప్రెషర్ టాయిలెట్ క్లీనింగ్ మిషన్ లను అయన పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య అతి ముఖ్యమైందని తెలిపారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో చిన్నారులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు సహాయంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే దాదాపు 100 పాఠశాలకు క్లీనింగ్ మిషన్లు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలోని మరుగుదొడ్లను అయనే స్వయంగా క్లీనింగ్ మిషన్ తో శుభ్రం చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రోహిణి, బీజేపి నాయకులు శ్యామ్ సుందర్, మేకల సారంగపాణి, వేణు యాదవ్, వీరన్న, సతీష్, తదితరులు పాల్గొన్నారు.