- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరి అరెస్ట్
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : షాపింగ్ కు వచ్చిన మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకుని పారిపోయిన ఇద్దరిని బుధవారం సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్ స్పెక్టర్ ముత్తు కథనం ప్రకారం సైదాబాద్ ప్రాంతానికి చెందిన తిప్పర్తి నాగమ్మ ఈ నెల 14వ తేదీన తన కూతురుతో కలిసి సుల్తాన్ బజార్ ప్రాంతానికి షాపింగ్ నిమిత్తం వచ్చింది. జైన్ మందిర్ ముందునుండి వారు ద్వి చక్ర వాహనంపై వెళ్తుండగా మరో ద్వి చక్ర వాహనంపై వచ్చిన మహిళ ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పారిపోయింది.
దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు స్థానికంగా సీసీ కెమెరాలను పరిశీలించి స్నాచింగ్ కు పాల్పడింది ముసారాంబాగ్ కు చెందిన పూజా అతుల్ పాండే , సాయిర్ ఖాన్, జబ్బార్ ఖాన్ , పఠాన్ లుగా గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి స్నాచింగ్ చేసిన బంగారు గొలుసు, ఓ బురఖా, ఎండు కారం ప్యాకెట్లు, బజాజ్ డిస్కవర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను జైలుకు తరలించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో కేసును ఛేదించిన సిబ్బందిని సుల్తాన్ బజార్ ఏసీపీ బాలగంగిరెడ్డి అభినందించారు.