హైదరాబాద్‌ను కాపాడేందుకే హైడ్రా ఆపరేషన్: దయాకర్

by srinivas |
హైదరాబాద్‌ను కాపాడేందుకే హైడ్రా ఆపరేషన్: దయాకర్
X

దిశ; తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ను కాపాడేందుకే హైడ్రా ఆపరేషన్ కొనసాగిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పదేళ్లలో చెరువులన్నీ ఆక్రమణకు గురయ్యాయని, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేశారని, అందుకే ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటల కబ్జాలను రిస్టోర్ చేస్తున్నామని, తద్వారా కాలనీలు, రోడ్లు మునిగిపోయే ప్రమాదం ఉండదని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం హైడ్రా ఆపరేషన్ జరగాల్సిందేనని వెల్లడించారు. అమృత్ టెండర్లపై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని దయాకర్ సవాల్ విసిరారు.

Next Story