- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ కాన్సిట్యూషన్ క్లబ్ నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలంలో కాన్సిట్యూషన్ క్లబ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ్యుల, శాసనమండలి సభ్యులు, మాజీ సభ్యులకు సౌలభ్యంగా ఉండే విధంగా కాన్సిట్యూషన్ క్లబ్ నిర్మించాలని నిర్ణయించారు. తెలంగాణ కాన్సిట్యూషన్ క్లబ్ దేశంలో ఒక మోడల్‌గా ఉండే విధంగా ఆర్కిటెక్చర్ సంస్థల ద్వారా డిజైన్లు రూపొందించాలని అధికారులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. బుధవారం శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, అసెంబ్లీ కార్యదర్శి డా.వి.నరసింహాచార్యులు, పర్యాటక శాఖ యండి ప్రకాష్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థలం కాన్సిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి అనువుగా ఉంటుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. వెంటనే డిజైన్లు రూపొందించాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను స్పీకర్, చైర్మన్, మంత్రులు ఆదేశించారు. రాజస్థాన్, ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్‌ల పనితీరును పరిశీలించి నివేదిక తయారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. కాన్సిట్యూషన్ క్లబ్‌ను సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. చట్టసభల సభ్యులకు అన్ని వసతులు, సౌకర్యాలు ఉంటూ తెలంగాణ కాన్సిట్యూషన్ క్లబ్ దేశంలో ఒక మోడల్ గా ఉండే విధంగా ఆర్కిటెక్చర్ సంస్థల ద్వారా డిజైన్లు రూపొందించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులకు ఆదేశించారు.