బాగా చదువుకోమంటే భవనంపై నుంచి దూకిన బాలుడు

by Disha News Desk |
బాగా చదువుకోమంటే భవనంపై నుంచి దూకిన బాలుడు
X

దిశ, శేరిలింగంపల్లి: భవనంపై నుంచి దూకి బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగండ్లలోని అపర్ణ సరోవర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసించే 8వ తరగతి విద్యార్థి అద్వైత్ కీమోతి(13) ఆదివారం 14 వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగా చదవాలని, చదువు పై శ్రద్ధ పెట్టాలని అతని తండ్రి అమిత్ కీమోతీ మందలించడంతో మనస్తాపానికి గురైన అద్వైత్ కీమోతి వారు నివసించే అపర్ణ సరోవర్ 14 వ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed