ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే ధ్యేయం: Arekapudi Gandhi

by Kalyani |   ( Updated:2022-12-21 11:12:34.0  )
ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే ధ్యేయం: Arekapudi Gandhi
X

దిశ, మియాపూర్: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బుధవారం మియాపూర్ డివిజన్ పరిధి మక్త మహబూబ్ పేట్ పెద్ద కుడి చెరువు సుందరీకరణలో భాగంగా రూ. కోటి 99 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అలుగు, కల్వర్టు నిర్మాణ పనులకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నియోజకవర్గంలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తూనే చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఏఈ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, గంగాధర్, కిరణ్ యాదవ్, మోహన్ ముదిరాజు, రఘునాథ్, అమరేందర్ రెడ్డి, ఎజాజ్, సుధాకర్, చందు, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, తిరుపతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed