రైలులోనే నగరానికి.. ఆ 7 తుపాకులు

by Mahesh |
రైలులోనే నగరానికి.. ఆ 7 తుపాకులు
X

దిశ, సిటీ క్రైం: మహరాష్ట్రకు చెందిన వ్యక్తి నుంచి 7 తుపాకులను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంఘటనలో రాచకొండ పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే స్టేషన్‌లలో మెటల్ డిటెక్టర్‌ల పని తీరుకు సవాలు విసురుతోంది. మెటల్ డిటెక్టర్‌లు ఉన్నా అందులో నుంచి తుపాకులను పెట్టుకుని వచ్చినా ఎవరు అతనిని గుర్తించక పోవడం కలవరం రేపుతోంది. అలా మెటల్ డిటెక్టర్ తనిఖీను దాటుకుని వచ్చి బయట వాటిని విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో రాచకొండ పోలీసులు అలర్ట్‌గా ఉండి సేకరించిన సమాచారంతో ఆ తుపాకులు క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్ళకుండా పోలీసులు నియంత్రించారు.

తాళం చెవి ఉన్నా.. తుపాకులు ఉన్నా అదే బీప్ సౌండ్..

దర్యాప్తులో భాగంగా 7 తుపాకులను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి రైలులో హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చినట్లు ఇటీవల పట్టుబడ్డ సాయి రామ్ రెడ్డి పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. తుపాకులను మహారాష్ట్ర వ్యక్తి నుంచి సేకరించుకున్న తర్వాత ఏడు తుపాకులను ఒక బట్టల లగేజీలో కింద పెట్టి జనరల్ బోగీలో ప్రయాణించాడు. ఆ భోగీలో కూడా తనిఖీ చేసినా గుర్తించని విధంగా భారీగా లగేజీ, ప్రయాణికులతో రద్దీగా ఉండే చోట వాటిని పెట్టేవాడు. ట్రైన్ దిగిన తర్వాత కూడా సాయిరామ్ రెడ్డి వెంటనే బయటకు రాకుండా మెటల్ డిటెక్టర్ వద్ద ఒకేసారి గుంపుగా వెళ్ళే ప్రయాణీకుల సమయాన్ని చూసుకుని అందులో కలిసిపోయి సురక్షితంగా బయటకు వచ్చే వాడని అతను విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అలా గుంపులో వచ్చే సమయంలో బీప్ సౌండ్ వచ్చిన ఎవరూ పట్టించుకోరని కూడా సాయిరామ్ వివరించినట్లు తెలుస్తోంది. ఆ రద్దీలో జేబులో తుపాకీ ఉన్నా, తాళం చెవి ఉన్న ఒకే రకమైన బీప్ సౌండ్ వస్తుందని పోలీసులకు అతను స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విధంగా చాలా మంది క్రిమినల్స్ వారి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సామాగ్రిని రైలు ప్రయాణం ద్వారా చేస్తారనే విషయం అనేక సందర్భాల్లో బయటపడ్డ విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed