Breaking: ట్యాంక్ బండ్‌పై ఉద్రిక్తత.. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు

by srinivas |   ( Updated:2024-09-15 05:23:07.0  )
Breaking: ట్యాంక్ బండ్‌పై ఉద్రిక్తత.. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ (Hyderabad Tank Bund)పై ఉద్రిక్త వాతావరణ కొనసాగుతోంది. ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనాల (Ganesh Nimajjanalu)పై నిషేధ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలపై భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు (Bhagyanagar Festival Committee Members) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన బారిగేడ్లను తొలగించారు. హుస్సేన్ సాగర్‌ (Hussain Sagar)లో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ప్రభుత్వం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ మండిపడ్డారు. ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనాలు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయని, ఇప్పుడెందుకు కొత్త రూల్స్ పెట్టారని ప్రశ్నించారు. 2022లో, 2023లో కూడా ఇదే విధంగా చెప్పారని, కానీ చివరకు ట్యాంక్ బండ్‌లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పట్టించుకోకపోతే సోమవారం హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనకు దిగాతామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed