బాలికపై పినతండ్రి ప్రలోభాలు

by Sridhar Babu |
బాలికపై పినతండ్రి ప్రలోభాలు
X

దిశ, జూబ్లిహిల్స్ : ఓ పిన తండ్రి కూతురు వరసైన బాలికను ఇబ్బందులకు, ప్రలోభాలకు గురి చేస్తుండటంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....బాధితురాలు ( 14 ) బోరబండలో తన తల్లి , పిన తండ్రి తో కలిసి నివసిస్తుంది. ఈ నేపథ్యంలో పిన తండ్రి బాధితురాలిని తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.

ఈ విషయాన్ని తల్లి కి చెప్పుకున్నా పట్టించుకోలేదు. దాంతో బాధితురాలు ఆ బాధలు భరించలేక శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు పిన తండ్రి పై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని చిల్డ్రన్ వెల్ఫేర్ సెంటర్ కి తరలించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed