ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంచుకునేలా సూచనలు చేయాలి

by Sridhar Babu |
ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంచుకునేలా సూచనలు చేయాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : నోడల్ అధికారులు పాఠశాలలను సందర్శించిన సమయంలో ఉపాధ్యాయులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా సూచనలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎఎస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్స్, మండల నోడల్ అధికారులు, డీఆర్పీఎస్, సర్వ శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లస్టర్ నోడల్ అధికారులు, మండల నోడల్ అధికారులు పాఠశాలలను సందర్శించిన సమయంలో పర్యవేక్షణ స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని,

పాఠశాలల్లో జరుగుతున్న మంచి, ప్రోత్సాహకరమైన, సానుకూల సమస్యల గురించి చర్చించాలని సూచించారు. తరగతి గది పరిశీలనకు ముందు ఉపాధ్యాయులతో కాసేపు మాట్లాడాలని, తరగతి గదిని గమనిస్తూనే గది వెనక చివరి బెంచ్ లు లేదా కుర్చీలో కూర్చొని విద్యా బోధన, అభ్యాసం, బోధనలోని అంతరాలను నోట్ చేసుకోవాలన్నారు. ఫౌండేషనల్ లిటరసి అండ్ న్యూమరాసి( ఎఫ్ ఎల్ ఎన్) అంతరాలను గుర్తించడానికి ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.రోహిణి, డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఐఓఎస్ లు, సీఎన్ఓలు, ఎమ్మన్నోలు, సర్వ శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed