- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పనులు పెండింగ్ పెట్టకండిః మాజీమంత్రి తలసాని
దిశ, బేగంపేటః నియోజకవర్గంలోని పనులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు చేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాంగోపాల్ పేట డివిజన్ కళాసిగూడలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాసిగూడ నాలా వెంట సీవరేజ్ పైప్ లైన్ పనులు పూర్తి చేసి రోడ్డు నిర్మించకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికుల ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ వెంటనే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షపునీరు ఎక్కడా నిలవకుండా సీవరేజ్ లైన్ ను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. తమకు నల్లాల ద్వారా సరఫరా అవుతున్న త్రాగునీరు కలుషితం అవుతున్నాయని స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డిసి సమ్మయ్య, ఈ ఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జిఎం ఆశిష్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బి ఆర్ ఎస్ డివిజన్ అద్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్ కుమార్, ఆంజనేయులు, విజయ్, కోటేశ్వర్ గౌడ్, బస్తీవాసులు దేవేందర్ చారి, చందు చారి తదితరులు పాల్గొన్నారు.