పబ్ లు, ఫాంహౌస్ లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్..

by Kalyani |   ( Updated:2023-02-18 13:59:33.0  )
పబ్ లు, ఫాంహౌస్ లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. పలువురి అరెస్ట్..
X

దిశ, శేరిలింగంపల్లి: అనుమతులు అతిక్రమించి నడుస్తున్న పబ్ తో పాటు మైనర్లను అనుమతిస్తున్న మరో పబ్ నిర్వాహకులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్ పరిధిలోని 16 పబ్ ల్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా హార్ట్ కప్ పబ్ నిర్వాహకులు చట్టవిరుద్ధంగా 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వినియోగదారులను అనుమతిస్తోందని ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. అలాగే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండానే బర్డ్ బాక్స్ పబ్ చట్టవిరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించిన పోలీసులు హార్ట్ కప్ పబ్ యాజమాని ఎం. పవన్ కుమార్, పబ్ మేనేజర్ ఆదిత్య తమంగ్ ను అరెస్ట్ చేశారు. అలాగే సరైనా లైసెన్స్ లేకుండా పబ్ నిర్వహిస్తున్న బర్డ్ బాక్స్ పబ్ యాజమాని పీ.అర్జున్ మేనేజర్ నూర్ఖాన్ బజార్ ను ఎస్ ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.


నగర శివారుల్లోని ఫాంహౌస్ లపై పోలీసుల దాడులు..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫాంహౌస్ లపై ఎస్ఓటీ పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఓటీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎంఏ రషీద్ నేతృత్వంలో పోలీసులు 33 ఫాంహౌస్ లపై దాడులు నిర్వహించారు. ఇందులో మొయినాబాద్ పీఎస్ పరిధిలోని సెలబ్రిటీ ఫాంహౌస్, ఎటర్నిటీ ఫాంహౌస్, ముషీరుద్దీన్ ఫాంహౌస్‌ లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నాయని గుర్తించారు. సెలబ్రిటీ ఫాంహౌస్ వాచ్ మెన్ సుధాకర్ ను అరెస్ట్ చేయగా దాని ఓనర్ ప్రశాంత్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

అలాగే ఎటర్నిటీ ఫాంహౌస్ వాచ్ మెన్ పోగుల పటేల్ రాజును అరెస్ట్ చేయగా ఫాంహౌస్ ఓనర్ వై. నరేష్ కుమార్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ముషీరుద్దీన్ ఫాంహౌస్ వాచ్ మెన్ స్వామిని అరెస్ట్ చేయగా ఫాంహౌస్ ఓనర్ ముషీరుద్దీన్ పరారీలో ఉన్నారు. పై మూడు ఫాంహౌస్ ల నుంచి రెండు ఓల్డ్ మంక్ రమ్ము, మూడు బ్లెండర్ స్ప్రెడ్ బాటిళ్లు, 21 బాటిళ్ల స్మిర్నోఫ్ వోడ్కా, చివాస్ రీగల్, 34 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story