- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచ్చలవిడిగా తవ్వారు.. వదిలేశారు..
దిశ, నల్లకుంట : అంబర్ పేట నియోజకవర్గం పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ ధోబి గల్లిలోని రోడ్లను నూతన డ్రైనేజ్ పైప్ లైన్ కోసం విచ్చలవిడిగా తవ్వి వదిలేశారు. దీని కారణంగా బస్తీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. త్వరితగతిన పైప్ లైన్ పనులు పూర్తిచేయాల్సిన సదర్ కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బస్తీవాసులు మండిపడుతున్నారు. పనులు ప్రారంభించిన దాదాపు పదిరోజులు కావస్తున్న పనులు ముందుకు సాగడంలేదని, తెచ్చిన సామాగ్రిని రోడ్ల పై వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలమండలి అధికారులు సదర్ కాంట్రాక్టర్ కుమ్మక్కై అభివృద్ధి పనులను గాలికి వదిలేసారని, కాంట్రాక్టర్ అనుకూలంగా ఉన్నసమయంలో పనులు చేపడుతున్నారని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు.
పదిరోజులుగా బస్తీలో రాకపోకలు కొనసాగిస్తున్న ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. రాత్రి సమయంలో రాకపోకలు కొనసాగించాలంటే వృద్ధులు, చిన్నపిల్లలు, వాహనదారులు అష్టకష్టాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీ వాసులు డ్రైనేజ్ పైప్ లైన్ పనులు పూర్తిచేయాలని అనేకసార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, సంబంధిత జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సదర్ కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణపు పనులు పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జలమండలి ఉన్నత అధికారులను బస్తీవాసులు కోరుకుంటున్నారు.