గద్దర్ ఆశయం అదే: Koonamneni

by srinivas |   ( Updated:2023-08-20 17:34:56.0  )
గద్దర్ ఆశయం అదే: Koonamneni
X

దిశ, తెలంగాణ బ్యూరో : కమ్యూనిస్టు ఉద్యమం, విప్లవ బాటలో నుండి పుట్టినవారే మహాత్ములయ్యారని వామపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు అన్నారు. చరిత్రలోని ప్రముఖులంతా ప్రజలను చదవి, వారి మనసులో వచ్చిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలకు కమ్యూనిస్టు ఉద్యమమే ప్రేరణ కలిపించిందని ఆయన తెలిపారు. ప్రజాయుద్ధనౌక, ప్రముఖ వాగ్గేయకారుడు గద్దర్ సంస్మరణ సభ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.

ఈ సందర్బంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బహుముఖ రూపాల కలయికలే గద్దర్ అని కొనియాడారు. ఎక్కడైతే ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, నష్టాల్లో నుండే పుట్టిన వారే కవులు, కళాకారులు అని అన్నారు. కవిత్వం, విప్లవ కవిత్వాలకు, సాహిత్యానికి జన్మనిచ్చిందే కమ్యూనిస్టు ఉద్యమం అని, గద్దర్ అంతిమంగా ఎర్రజెండానే రావాలని కోరుకున్నారన్నారు. ప్రశ్నను, ప్రజా పోరాటాల కొనసాగించాలన్నారు. జనాలు ఉన్నారు కాబట్టే కాంగ్రెస్, బీజేపీ సభలకు గద్దర్ వెళ్లారని, ఎక్కడ జనం ఉంటే అక్కడ ఆయన ఉన్నారని వివరించారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేసేందుకు చాలా మంది ప్రయత్నించారని, ఆయన బతికున్నప్పుడు వేధిచారని, ఇది పాలకుల సహజ లక్షణమన్నారు. పాడే వాడి గొంతు నులుముతారని, ప్రశ్నించేవాడి గొంతును, తుపాకీతో పోరాటం చేసే వాడి చేతులను , గజ్జె కట్టిన కాలును, చివరకు కంఠాన్ని తీయడం పాలకుల లక్షణమని, చివరకు మరణించిన తర్వాత రాజకీయం చేసేందుకు అందరూ వస్తారని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed