- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేవా భారతి ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్
దిశ, శేరిలింగంపల్లి: సేవా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికారత కోసం, కిషోరి వికాస్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి గాను 21 కె, 10కె, 5కె రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 7వ ఎడిషన్ గచ్చిబౌలిలో ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఈ రన్‌ను అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, పోలీసు సూపరింటెండెంట్ శివ కుమార్ గౌడ్, అఖిల భారత సేవా భారతి ప్రధాన కార్యదర్శి రేణు పాఠక్‌లతో పాటు మల్టీ నేషనల్ సంస్థల కార్పొరేట్ అధిపతులు కూడా కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రన్లో కార్పొరేట్లు, వారి కుటుంబాలు, మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు ఈ రన్ లో పరుగులు తీశారు. ఈ రన్ గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు 5 కిలోమీటర్లు కొనసాగగా, సెంట్రల్ యూనివర్శిటీ మీదుగా 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల రన్ తిరిగి స్టేడియానికి చేరుకుంది.
ప్రస్తుతం 300 కిషోరి వికాస్ కేంద్రాలు హైదరాబాద్ మురికివాడల్లో 6700 మంది లబ్ధిదారులతో చురుకుగా పనిచేస్తున్నాయని, ఈ రన్ ద్వారా మరో 500 కిషోరి కేంద్రాలను విస్తరిస్తూ 10,000 మంది లబ్ధిదారులకు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సేవా భారతి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి ప్రభాల తెలిపారు.
ఈ కేంద్రాలు మురికివాడలు, తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధికి తోడ్పడుతున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. ఈ రన్ లో ఇన్ఫోసిస్, జీఈపీ, జెన్ప్యాక్ట్ల ప్రతినిధులు హాజరు కాగా, యశోద హాస్పిటల్స్, టెక్‌వేవ్, టెక్ వేదిక, జీఈపీ, సినోప్సిస్, పెగా సిస్టమ్స్, గ్లోబల్ లాజిక్, హెల్త్‌ఎడ్జ్, కోటివిటి, 91 సిగ్నేజ్‌లు, ఫీవర్ ఎఫ్ ఎం, ఇన్నోవా సొల్యూషన్స్ వంటి సంస్ధలు రన్ కి భాగస్వామ్య మద్దతునిచ్చాయి.