- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎంఆర్ఎఫ్ సహాయం పెంచమని సీఎంను కోరుతా.. ఎమ్మెల్యే గాంధీ
దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి ప్రస్తుతం ఆసుపత్రుల్లో అవుతున్న బిల్లులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. గురువారం వివేకానంద నగర్ లోని తన నివాసంలో 67 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు.
ఇందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నో వందలాది కుటుంబాలను తాము ఆదుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్థిక సహాయం అందిస్తుందని దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసి వినతిపత్రాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.