- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > నగరంలోని ఈ ప్రాంతానికి రెడ్ వార్నింగ్.. దంచికొడుతున్న భారీ వర్షం
నగరంలోని ఈ ప్రాంతానికి రెడ్ వార్నింగ్.. దంచికొడుతున్న భారీ వర్షం
X
దిశ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా నగరంలో పెరిగిన వాతావరణం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు మంగళవారం ఒక్కసారిగా మారిన వాతావరణం తో రిలాక్స్ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా మేఘావృతం అయ్యాయి. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగరంలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన విడుదలైన కొన్ని క్షణాల వ్యవధిలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మణికొండ, మాదాపూర్, కేపీహెచ్ బీ, బాలానగర్ నార్సింగి, అత్తాపూర్ , మియాపూర్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభం కాగా.. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లక్డీకపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.
Advertisement
Next Story