- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ సీనియర్ సిటిజన్ కు రామ్ లల్ల దర్శనం చేపిస్తాం
దిశ, కార్వాన్ : త్వరలో అయోధ్యలో రామాలయంలో రామ్ లల్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపడుతున్నట్లు, అందులో తెలంగాణ ప్రాంత సీనియర్ సిటిజెన్లకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కార్వాన్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు దర్బార్ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జియాగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ
దేశంలో త్రిబుల్ తలాక్ తెచ్చిన ఘనత బీజేపీదేనని కొనియాడారు. పది సంవత్సరాలుగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. 1984లో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలలో ఒకరు గుజరాత్ ఎంపీ కాగా, మరొకరు తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీగా గెలుపొందారని, నేడు ప్రభుత్వాన్ని చేపట్టిన ఘనత బీజేపీదేనని చెప్పారు. 30వ తేదీన ప్రజలందరూ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గెలిచిన తర్వాత మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తమతో కలుస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.