Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పరిస్థితి ఇంత దారుణమా.. ?

by srinivas |   ( Updated:2023-07-24 13:15:45.0  )
Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. పరిస్థితి ఇంత దారుణమా.. ?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా వర్షం కురిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకూ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకూ వాహనాలను మళ్లించారు. అటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికెళ్లే సమయం కావడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. వర్షం ఆగే వరకూ కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.

మరోవైపు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితిని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సమీక్షిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం రూ. 040-2111111, 9000113667కు సంప్రదించాలని సూచించారు.

భారీ వర్షాలతో అప్తమత్తంగా ఉండాలని అటు గవర్నర్ కూడా నగర వాసులనుద్దేశించి ట్వీట్ చేశారు. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

మరోవైపు భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement

Next Story