- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సాయంత్రం నుంచి భారీ వర్షాలు...!
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నాలాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే కొద్ది సేపటి క్రితం వర్షం ఆగిపోయింది. కానీ వాన గండం మాత్రం ఇంకా పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పిడిగు లాంటి వార్త చెప్పారు. ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.
అటు పశ్చిమ తెలంగాణకు భారీ వర్షం పొంచి ఉందని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ ప్రాజెక్టులు మొదలుకుని చిన్న చిన్న కుంటల వరకు వర్షపు నీటితో నిండుకులండల్లా మారాయి. రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నదీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు ప్రమాదక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More : Hyderabad floods : అధికారుల కీలక నిర్ణయం.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్