- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేపర్ లీకేజీ పై ఓయూలో కొనసాగిన నిరసన ర్యాలీలు, అరెస్టులు
దిశ, సికింద్రాబాద్: పేపర్ లీకేజీపై ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శనివారం కూడా విద్యార్ది నాయకుల అరెస్టులతో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం హోరెత్తింది. కేసీఆర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు. కవిత లిక్కర్ స్కాం చేస్తే, కేటీఆర్ పేపర్ స్కాం చేశాడంటూ నినదించారు. ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసి, ఏబీవీపి నాయకులు పెద్ద ఎత్తున నిరసన, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేపర్ లేకేజిలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. సీబీఐ చేత విచారణ జరిపించి దోషులను శిక్షించాలని తెలిపారు. బోర్డు చైర్మన్ ను అరెస్టు చేసి, టీఎస్పిఎస్సీ ని ప్రక్షాళన చేసి నూతన నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ఏబీవీపి నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.