- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి : డీఆర్వో సూర్యలత
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవరాం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి వచ్చిన 21 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు సమర్పించే దరఖాస్తులపై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని సూచించారు. క్రింది స్థాయిలో పరిధిలో పరిష్కారం కాని ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే వాటిని తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఫిర్యాదుదారుల సమస్య పరిష్కారం అయ్యేవరకు సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.