- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల ముందుకు తెచ్చేందుకే ప్రజా గోస...బీజేపీ భరోసా : డాక్టర్ కె.లక్ష్మణ్
దిశ, ముషీరాబాద్ : ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల ముందుకు తెచ్చేందుకే "ప్రజా - గోస బీజేపీ భరోసా కార్నర్ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని టీఆర్‌టీ, ఎస్ఆర్టీ శక్తి కేంద్రంలో "ప్రజాగోస, బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సభనుద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో నియోజకవర్గంతో పాటు గాంధీనగర్ డివిజన్‌లో చేసిన పలు అభివృద్ధి పనులను గుర్తు చేశారు. అలాగే జవహర్నగర్ కమ్యూనిటీహాల్‌ను అప్పటి ప్రభుత్వం సర్కిల్ - 3 ఆఫీస్ గా మార్చాలనే ఉద్దేశాన్ని తిప్పికొట్టి స్థానిక ప్రజల కొరకు అక్కడ కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేయడంలో విజయం సాధించామన్నారు.
కార్పొరేటర్ పావని మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశ నిర్వాహకులు టీఆర్‌టీ, ఎస్ఆర్టీ శక్తి కేంద్రం ఇంఛార్జి నవీన్ కుమార్, 15, 16, 17, 18 బూత్ అధ్యక్షులు సాయి, మనీష్, జీవన్ తో పాటు బీజేపీ మహంకాళి జిల్లా ఇంఛార్జి నగురావు నమోజి, నగర యువ నాయకులు ఎ.వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రమేశ్ రామ్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, మోర్చ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు దామోదర్, శ్రీకాంత్, నరేందర్, ఉమేష్, నర్సింగ్ రావు, శ్రీను, సురేష్, శ్రీనివాస్, సాయి కుమార్, హన్మంతు, ఆనంద్ రావు, అరుణ్ కుమార్, ఆకుల అభిషేక్, నీరజ్ పాల్గొన్నారు.