నిబంధనల ఉల్లంఘన: సైలెంట్‌గా తరగతుల నిర్వహణ

by Disha News Web Desk |
నిబంధనల ఉల్లంఘన: సైలెంట్‌గా తరగతుల నిర్వహణ
X

దిశ, మియాపూర్: ప్రభుత్వ ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోకుండా తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్ డివిజన్ గంగారంలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సోమవారం ఉదయం 8,9,10 తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు స్కూల్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలో 10 మంది విద్యార్థులకు పాఠాలు బోధించడం గమనించామని తెలిపారు. అంతేగాక, మరికొంత మంది విద్యార్థులు అప్పుడే స్కూల్‌కి చేరుకుంటున్నారని అన్నారు. కరోనా విస్తృత వ్యాప్తి మూలంగా ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహించడం ఏంటని వారు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీనికి వారు స్పందిస్తూ.. విద్యార్థులను బయటకు పంపి, పాఠశాల మూసివేశారు. ఇలాంటి స్కూళ్లపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story