ఓయూ వీసీ పాఠాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన..

by Vinod kumar |
ఓయూ వీసీ పాఠాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన..
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ తమకు పాఠాలు చెప్పాలంటూ పలువురు ఓయూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం వర్సిటీ దూరవిద్య కేంద్రంలో ఓ వర్క్ షాప్ కు వీసీ అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు అక్కడకు చేరుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. తాళాలు వేసి పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో పాఠం చెప్పకుండా వీసీ పదవి నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ రవీందర్ అని మండిపడ్డారు. తక్షణమే ఆయనను రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story