వెనక్కి తగ్గం.. హైడ్రాపై మల్లు రవి సెన్సేషనల్ కామెంట్స్

by srinivas |   ( Updated:2024-10-13 14:42:56.0  )
వెనక్కి తగ్గం.. హైడ్రాపై మల్లు రవి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముసీ ప్రక్షాళనకు సీఎం కంకణం కట్టుకున్నారని, ఎన్ని అభ్యంతరాలు, అవాంతరాలు ఎదురైనా, పేద ప్రజలకు న్యాయం చేసేందుకు వెనకడుగు వేసేది లేదని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల దగ్గర తాము పాఠాలు నేర్చుకునే స్థాయిలో లేమన్నారు. బీఆర్ఎస్ నాయకులు 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి తెలంగాణకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లు పదేళ్ల పాటు నాశనం చేసిన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు , సీఎం రేవంత్ రెడ్డి పగలు,రాత్రి కష్టపడుతున్నారన్నారు. యువకుల కోసం, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ని తీసుకొచ్చాడన్నారు. రాజ్యాంగ విలువల్ని కాపాడింది సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. కానీ రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చేసేది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అని మండిపడ్డారు. 10 ఏళ్లలో 5 వేల పాఠశాలలు మూతపడ్డాయని, కానీ తాము రాష్ట్రంలో 28 నియోజక వర్గాలల్లో అంతర్జాతీయంగా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యా భోధన వసతలతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు నిర్మించబోతుందని ఎంపీ మల్లు రవి తెలిపారు.

Advertisement

Next Story