ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..

by Kalyani |
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
X

దిశ, మెట్టుగూడ: ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను శుక్రవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.19 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 2 సర్వీసులు రద్దు కాగా, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 3 సర్వీసులు రద్దు అయినట్లు తెలిపింది.ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 5 సర్వీసులు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 6 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఫలకనుమ-రామచంద్రపురం, రామచంద్రపురం-ఫలకనుమ, ఫలకనుమ-హైద్రాబాద్ లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది

.

Advertisement

Next Story