మంత్రి సీతక్క కారు ఆపి యువకుడు హల్చల్

by Sridhar Babu |
మంత్రి సీతక్క కారు ఆపి యువకుడు హల్చల్
X

దిశ, ఖైరతాబాద్ : ప్రజా భవన్ వద్ద యువకుడు హల్చల్ సృష్టించాడు. తన సమస్యను పరిష్కరించాలని ప్రజాభవన్ నుంచి అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క కారును ఆపి హంగామా చేశాడు. యువకుడు మల్లాపూర్​కు చెందిన యోహాన్ సిరిమల్ల తనకు పోలీసులు అన్యాయం చేశారని, తన బాధను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో నేరుగా చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోరాడు. తనకు న్యాయం జరగదని ప్రజాభవన్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపాడు. తాను న్యాయం కోసం పోరాడుతున్నానని, తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అతని ఫిర్యాదును స్వీకరించి, న్యాయం జరిగేలా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు.

Advertisement

Next Story