- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతిని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్..
దిశ, ఖైరతాబాద్: హైదారాబాద్ నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ సంఘటన చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతోందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ వరంగల్ కమిషనర్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. వైద్యులతో గంట గంటకు మంత్రి హరీష్ రావు స్వయంగా మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షిస్తున్నారు అని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ డైరెక్టర్‌ను, వైద్య బృందాన్ని ప్రీతికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను ఆదేశించారని వెల్లడించారు.
ప్రీతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారని.. ప్రస్తుతానికి వెంటిలేటర్, సి ఆర్ ఆర్ టి డయాలసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులతో కలిసి వెళ్లినప్పుడు వారి మాటలకు ప్రీతీ కళ్ళు తెరిచి చూడగలుగుతుందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రీతి ఆరోగ్యంగా కోలుకుని క్షేమంగా బయటకు రావాలని మంత్రి భగవంతున్ని ప్రార్థించారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.