Good News: కేసీఆర్ మళ్లీ సీఎం కాగానే రూ.6,016 పింఛన్

by srinivas |   ( Updated:2023-10-19 10:40:20.0  )
Good News: కేసీఆర్ మళ్లీ సీఎం కాగానే రూ.6,016 పింఛన్
X

దిశ, వెబ్ డెస్క్: దివ్యాంగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే రూ. 6,016 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో దివ్యాంగుల కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రస్తుతం 4, 016 పింఛన్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 ఏళ్లలో దివ్యాంగుల కోసం రూ. 10, 300 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 నుంచి 4 శాతానికి రిజర్వేషన్ పెంచామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తాము ఇస్తున్నట్లు పింఛన్ ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు.


చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. అక్కడ పింఛన్ ఎంత ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాము ఇచ్చినట్లుగా దివ్యాంగులకు రూ. 4,016 ఇస్తున్నారా అని నిలదీశారు. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో ఇచ్చే పింఛన్ 1100 అని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇచ్చే పింఛన్ రూ. 600 నుంచి రూ. 1000 మాత్రమేనని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story