- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ-మెయిల్‌తో మెఘా ఇంజినీరింగ్ కంపెనీనీ బోల్తా

దిశ, సిటీక్రైం : సైబర్ నేరగాళ్లు అక్షరం తేడాతో పంపిన ఈ-మెయిల్‌తో మెఘా ఇంజినీరింగ్ కంపెనీనీ బోల్తా కొట్టించారు. సైబర్ క్రైం బ్యూరో అధికారులు, ఫిర్యాదుదారులు వెల్లడించిన వివరాల ప్రకారం..హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్న మెఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ నెదర్‌ల్యాండ్స్ దేశానికి చెందిన డ్యూకర్ కంబషన్ ఇంజినీర్స్, టఫ్స్ షిప్పర్ కంపెనీతో బర్నర్ ప్యాకేజీ, ఇన్‌సినిరేటర్ బర్నర్‌ల సరఫరాకు సంబంధించి ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం 2022 నుంచి నడుస్తుంది. ఈ సరఫరాకు సంబంధించి ఆర్ధిక లావాదేవిలు మెఘా ఇంజినీరింగ్ కంపెనీ నేదర్‌ల్యాండ్స్ కంపెనీకి చెందిన ఏబీఎన్ ఆమ్రో ఖాతాతో జరిపారు. ఇలా జరిపిన ప్రతి ఆర్ధిక లావాదేవికి నెదర్‌ల్యాండ్స్ కంపెనీ తమ అధికారిక మెయిల్ ఐడీ nuijs@duiker.com ద్వారా ఆ కంపెనీ ప్రతినిధి పీటర్ న్యూజిస్ ద్రవీకరించేవారు. గత ఏడాది నవంబరు నెలలో మేఘా కంపెనికి Nuijis@duiker.cam ద్వారా పీటర్ న్యూజిస్ పంపినట్టు మెయిల్ వచ్చింది. అందులో మీరు ఇప్పటి వరకు ఏబీఎన్ ఆమ్రో కంపెనీకి పంపిన ఖాతా పై నెదర్‌ల్యాండ్స్‌లో ఆంక్షలను పెట్టారు. అందువలన మీరు తదుపరి ఆర్ధిక లావాదేవిలు ఈ మెయిల్‌లో పంపిన జేపీ మార్గన్ ఛేజ్, యూఎస్ఏ ఖాతాకు పంపాలని కోరారు. దీంతో గత నెల 24, 25 తేదీల్లో రూ.5.47 కోట్లను మేఘా కంపెనీ కొత్త ఖాతాకు పంపారు. పేమెంట్ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో మేఘా కంపెనీ నెదర్‌ల్యాండ్స్ కంపెనీని సంప్రదించి పేమెంట్ విషయాన్ని తెలిపింది. ఈ పేమెంట్ తమకు అందలేదని వారు నిర్ధారించడంతో మేఘా కంపెనీ షాక్‌కు గురైంది. మీరు కొత్త ఖాతా పంపించారు దానికి పంపించామని తెలపడంతో తాము ఖాతా మార్చలేదని మీకు వచ్చిన మెయిల్ ఐడీని సరిచూసుకోమని నెదర్‌ల్యాండ్స్ కంపెనీ ప్రతినిధులు సూచించారు. దీంతో మేఘా కంపెనీ తనిఖీ చేసుకోగా నెదర్‌ల్యాండ్స్ కంపెనీ ఒరిజినల్ మెయిల్ ఐడీలోని ఓ అక్షరాన్నికి బదులు ఏ అక్షరంతో మార్చి పంపించారని తెలుసుకున్నారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అకౌంట్స్ మేనేజర్ డీ.శ్రీహరీశ్ ఈ నెల 13న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. సైబర్ బ్యూరో అధికారులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.