జూబ్లీహిల్స్‌లో బెంజ్ కార్ బీభత్సం

by Disha Web Desk 9 |
జూబ్లీహిల్స్‌లో బెంజ్  కార్ బీభత్సం
X

దిశ, జూబ్లిహిల్స్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ బెంజ్ కారు అదుపుతప్పి కరెంట్ ట్రాన్స్ఫరం నీ ఢీ కొట్టిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారు జామున 3.30 ప్రాంతంలో కొత్త బెంజ్ కారులో డ్రైవర్ వెంకట్, ఆశ , ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ లు మొత్తం నలుగురు వ్యక్తులు, జూబ్లిహిల్స్ చెక్పోస్ట్ వైపు రోడ్ నెం. 36, పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్స్ఫరం నీ డీ కొట్టింది. ఆ కారులో డ్రైవింగ్ చేస్తున్న వెంకట్ అనే వ్యక్తి మద్యం సేవించటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రోడ్ నెం. 36, రోడ్ నెం. 10 వద్ద టర్నింగ్ పాయింట్ చాలా ప్రమాదకరంగా మారిందని, గతంలో హిట్ అండ్ రన్ కేసులో ఈ ప్రాంతంలోనే ఒక వ్యక్తి మరణించాడని వెల్లడించారు.



Next Story

Most Viewed