- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRK Bhavan: మాకే ఇవ్వండి.. పలు శాఖల నుంచి పెరుగుతున్న డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. అందుబాటులో ఉన్న భవనాలు, వనరులను ఉపయోగించుకుని తక్కువ ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. దీంతో నెలకు లక్షలాది రూపాయలను ప్రైవేటు భవనాలకు అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తుంది. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కేఆర్)భవన్‌ను గతంలో సచివాలయంగా ఉపయోగించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి కావడంతో బీఆర్‌కేఆర్ భవన్ నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు బీఆర్‌కేఆర్ భవన్‌లోని అత్యధిక భాగం ఖాళీగానే ఉంది. ఇందులో తాత్కాలిక ప్రాతిపదికన ఎన్నికల కమిషన్, విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్, పే రివిజన్ కమిషన్, మీడియా ఆకాడమీ చైర్మన్‌కు కేటాయించారు. మిగిలిన బిల్డింగ్ అంతా ఖాళీగానే ఉంది.
సెర్ప్ ఆఫీసుకు నెలకు రూ.14 లక్షల అద్దె
బీఆర్‌కేఆర్ భవన్‌లోని ఆఫీసులు కొత్త సెక్రెటేరియట్‌కు వెళ్తున్న సందర్భం నుంచే పలు శాఖల అధిపతులు తమకు బీఆర్‌కేఆర్ భవన్‌ను కేటాయించాలని కోరారని సమాచారం. బీఆర్‌కేఆర్ భవన్ ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో నెలకు రూ.లక్షల్లో అద్దె చెల్లించి కొనసాగుతున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు కొన్ని నెలల క్రితమే తమకు బీఆర్‌కేఆర్ భవనాన్ని కేటాయించాలని కోరారు. సెర్ప్ ఇప్పుడున్న అద్దె భవనానికి నెలకు రూ.14 లక్షల అద్దెను చెల్లిస్తుంది. నూతన సెక్రెటేరియట్ నిర్మాణం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రూ.రెండున్నర కోట్లు వరకు అద్దెకే చెల్లించినట్టుగా తెలిసింది. ప్రభుత్వ నిధులను ప్రైవేటు సంస్థలకు చెల్లించడం వల్ల ఉపయోగడం ఉండబోదని, ప్రజాధనం వృథా తప్పితే మరేమిలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తమకు భవనం కేటాయిస్తే ఇంటీరియర్ అంతా తామే ఏర్పాటు చేసుకుంటామని శాఖ అధికారులు స్పష్టంగా ఉన్నతాధికారులకు చెప్పినట్టుగా విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. సెర్ప్ ఆఫీసు అద్దెకు ఉన్న భవనంలోనే గనుల శాఖ డైరెక్టర్ఆఫీసు కొనసాగుతోంది. ఈ శాఖ గతంలో బీఆర్‌కేఆర్ భవన్‌లోనే కొనసాగేది. కానీ, వారికి పాత భవనాన్ని ఇవ్వడం లేదు. దీనితో పాటుగా స్త్రీనిధి సంస్థ సైతం తమకు నగరంలో ఎక్కడైనా స్థలాన్ని కేటాయిస్తే తమ సంస్థ నిధులతో సొంత భవనాన్ని నిర్మించుకుంటామని, ప్రభుత్వాన్ని పైసా అడగకుండా నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉందని వారు తెలిపారు. ఈ ప్రతిపాదన గత రెండేండ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న తమ సంస్థకు భూమి కేటాయించడం నిబంధనలకు విరుద్ధం కాదని, ల్యాండ్ కేటాయింపునకు అయ్యే డబ్బులు సైతం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఇంత వరకు సానుకూల స్పందన రాలేదని సమాచారం.