అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది: నవీన్ మిట్టల్

by S Gopi |
అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది: నవీన్ మిట్టల్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: అర్చక ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో చర్యలు తీసుకుంటుందని తెలంగాణ అర్చక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ నవీన్ మిట్టల్ అన్నారు. ఈ మేరకు గురువారం సిసిఎల్ ఏ కార్యాలయంలో జరిగిన అర్చక వెల్ఫేర్ బోర్డు మొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు. బోర్డు సభ్యులుగా నియమితులైన కాండూరి కృష్ణమాచారి, చిలకమర్రి శ్రవణ్ కుమార్ చార్యులు, జక్కాపురం నారాయణ స్వామిలను ఆయన అభినందించారు. తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. బోర్డు సభ్యులు కూడా గుర్తించిన సమస్యలను తన ముందుకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్ వినోద్ రెడ్డి, రిటైర్డ్ జడ్జి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed