గత ఏడాది పీసీసీ అధ్యక్షుడిగా...నేడు సీఎంగా...

by Sridhar Babu |
గత ఏడాది పీసీసీ అధ్యక్షుడిగా...నేడు సీఎంగా...
X

దిశ, ఖైరతాబాద్ : గత ఏడాది పీసీసీ అధ్యుడిగా...నేడు సీఎంగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని ముఖ్యమంత్రి రేవంత్‏ రెడ్డి దర్శించుకొని తొలి పూజ నిర్వహించారు. అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 70 ఏండ్లుగా ఖైరతాబాద్‎లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఖైరతాబాద్ బడా గణేషుడి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత గొప్పగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఒక్క హైదరాబాద్ లోనే లక్షా 40 వేల గణనాథుళ్లను ఏర్పాటు చేశారని తెలిపారు.

గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది పీసీసీ అధ్యక్షుడి పదవిలో వచ్చానని, నేడు ముఖ్యమంత్రి హోదాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని , దేవుడి ఆశీస్సులతో తక్కువ నష్టంతోనే బయటపడ్డామని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed