- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ మానవత్వం లేని మృగం : Bandi Sanjay Kumar (బండి సంజయ్ కుమార్)
దిశ, ముషీరాబాద్ : కేసీఆర్ మానవత్వం లేని మృగమని, ఆయన కుటుంబానికి బలగం సినిమా చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నా ఫోన్ కేసీఆర్ వద్దే ఉందని, అందులో మంత్రులు, ఎమ్మెల్యే లు తనతో కాంటాక్ట్ లో ఉన్నారని, అది చూసి షాక్ అయ్యారని స్పష్టం చేశారు. కేసీఆర్ కంటి వెలుగు ఆపరేషన్ చేయించుకుంటే మోడీ ఎందుకు వచ్చారో తెలిసి ఉండేదని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని థియేటర్ లో బండి సంజయ్ బలగం సినిమాను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బిచ్చం ఎత్తుకున్న నీకు కోట్లు ఎలా వచ్చాయని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి నిరసనగా ఈ నెల 15న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముందు సీపీ కాల్ లిస్ట్ తీస్తే ... ఆయనకి ఎవరు కాల్ చేశారనేది తెలుస్తుందన్నారు. అక్కడున్న మంత్రుల ఫోన్ తీసుకోవాలన్నారు. నా ఫోన్ కేసీఆర్ వద్దే ఉందని అన్నారు. అందులో నాతో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యే లు కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పారు. మొన్న ప్రధాని టూర్ కి కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అభివృద్ది కాకుండా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొఖం లేక ప్రధాని టూర్ కి కేసీఆర్ డుమ్మా కొట్టారని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాకుంటే కార్యక్రమం ఆగిందా ? అని ప్రశ్నించారు. సీఎం రాలేదని ఎవరు బాధపడ్డారు ? అని అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఏం చేశాడని నోటీసులు ఇచ్చారని నిలదీశారు. నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టే ఫోన్ అంటున్నావ్ అని, సిద్దిపేట వరకు నా ఫోన్ ఉందని, మరి తర్వాత ఏమైంది ? అని ప్రశ్నించారు. ఐదు గంటలకు ఫోన్లో వచ్చిన మెసేజ్ చూశాను అంటున్నారు కదా మరి అప్పటి వరకు ఎగ్జామ్ ఉంటదా ? అని అన్నారు. ప్రశాంత్ ఫోన్ కూడా మీ దగ్గరే ఉంది కదా అన్నారు. సీపీని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, ఆయన సంగతి చూస్తామని బండి హెచ్చరించారు.
నీ ఆస్తులు, అక్రమాలు అన్నీ తమకు తెలుసు అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం నీకేం అవసరమని కేసీఆర్ ను ప్రశ్నించారు. దమ్ముంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని సవాల్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం మాటేమిటి ? అని, సింగరేణిలో చాలా మంది ఉద్యోగాలను తొలగించారన్నారు. అందులో టెండర్లు అన్నీ కేసీఆర్ వే అని ధ్వజమెత్తారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఎందుకు రాలేదన్నారు. సీఎం కంటి వెలుగు ఆపరేషన్ చేయించుకుంటే మోడీ ఎందుకు వచ్చారో కనపడతదన్నారు. రేవంత్ రెడ్డి కుమార్తె పెళ్లి పనులు చూసుకోకుండా చేశారన్నారు. మా అత్తమ్మ ఐదు దినాల కార్యక్రమం చేయకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మానవత్వం లేని మృగం అని అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి బలగం సినిమా చూపించాలని, అప్పుడు కానీ మానవత విలువలు తెలుస్తాయని హితవు పలికారు. బలగం సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ సినిమాను కార్యకర్తలతో కలిసి చూడటం సంతోషంగా ఉందన్నారు. హిందూ సనాతన ధర్మం లో ఆచరణను చూపించారని తెలిపారు. అలాగే మానవతా సంబంధాల ప్రాధాన్యతను డైరెక్టర్ వేణు చక్కగా చూపించారని అభినందించారు. చిన్న సినిమా చేస్తే లాభం ఏంటి అనేది నిర్మాతలు ఆలోచిస్తున్నారన్నారు. వేణు ఇదంతా పట్టించుకోకుండా వాస్తవికతతో సినిమా తీశారన్నారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు చింతల రాంచంద్రారెడ్డి, శ్యామ్ సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read more: