HYD: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వస్తే చిక్కినట్లే!

by GSrikanth |   ( Updated:2022-09-09 05:21:37.0  )
HYD: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వస్తే చిక్కినట్లే!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్(ట్యాంక్‌బండ్‌)కు దాదాపు 20 వేలకు పైగా విగ్రహాలు తరలిరానున్నాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌లో మొత్తం 22 భారీ క్రేన్లను సిద్ధం చేసి ఉంచారు. గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా దాదాపు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ కెమెరాలను నూతనంగా ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. అంతేగాక, ట్యాంక్‌బండ్‌లో వ్యర్థాల తొలగింపునకు 20 జేసీబీలు, 168 యాక్షన్ బృందాలను జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం చేసి ఉంచారు. నేటి(శుక్రవారం) నుంచి రేపు(శనివారం) ఉదయం వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. గణేష్ శోభయాత్ర మార్గల్లో ఇతర వాహనాలను అనుమతి నిరాకరించారు. ఉదయం 10 గంటల నుంచి బాలాపూర్‌ గణేష్ శోభయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9:30 మధ్య బాలాపూర్‌ గణేష్ లడ్డూ వేలం జరుగనుంది. ఈ వేలం కోసం కేవలం నగర ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. మదీనా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా శోభయాత్ర జరుగనుంది.

Also Read : హైదరాబాద్‌ గణేశ్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా అసోం సీఎం


Advertisement

Next Story

Most Viewed