హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. MMTS రైళ్లు రద్దు

by samatah |   ( Updated:2023-07-31 04:51:59.0  )
హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్.. MMTS రైళ్లు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ MMTS ప్రయాణికులకు కీలక సమాచారం. ఈరోజు నుంచి ఆగస్టు 6 వరకు 22 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ట్రాక్ ల నిర్వహణ, మరమ్మత్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే, ఆగస్టు 6 వరకు ప్యాసింజరు రైళ్ల రద్దు కానున్నాయి.

కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఆగస్టు 6 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా రైళ్ళను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్ పుష్పుల్ రైలు (07753/54), SEC-WGL పుష్ పూల్ (07462/63), రామగిరి ఎక్స్ప్రెస్ (17003/4), బల్లార్షా ఎక్స్ప్రెస్ (17035/36), సింగరేణి ఎక్స్ప్రెస్ (17033/34) రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed