Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి 13 మెట్రో స్టేషన్లు

by Disha Web Desk 1 |
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు బంపర్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి 13 మెట్రో స్టేషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మెట్రో ఫేజ్-2కి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. ఇందులో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మార్గంలో నాగోల్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఫేజ్-2లో మొత్తం 13 మెట్రో స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నాగోల్ మెట్రో స్టేషన్‌తో ప్రారంభమై.. నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మెట్రో రైలు ఎలైన్‌మెంట్, స్టేషన్ల ఏర్పాటుకు శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు.



Next Story

Most Viewed