- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన అదనపు కలెక్టర్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. "భారత దేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకున్న భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అంగీకరించుకుని అది శాసనం చేసుకున్నామని, ఇందుకు కట్టుబడి ఉంటామని సత్యనిష్ట పూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు" అని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత, ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోషి, కలెక్టరేట్ కార్యాలయ విభాగాల అధిపతులు, సిబ్బంది, తదితరులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.