- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన HCA ఎన్నికలు.. కౌంటింగ్ ప్రక్రియ షురూ
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకూ హోరాహోరీగా జరిగింది. ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్, మిథాలి రాజ్, స్రవంతి నాయుడు, జీహెచ్ ఎంసీ కమిషర్ రోనాల్డ్ రాస్‌తో సహా మొత్తం 173 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియడంతో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సాయంత్రం 6 లోపు ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.
కాగా హెచ్ సీఏ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్యానళ్లకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు తెలిపాయి. ప్రధానంగా యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్, గుడ్ గవర్నెన్స్ ప్యానల్, క్రికెట్ ఫస్ట్ ఫ్యానెల్, అర్షద్ ఆయూబ్ ప్యానళ్ల మధ్య పోటీ జరిగింది.. యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు అధికార బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. గుడ్ గవర్నెన్స్ ప్యానల్‌కు బీజేపీ మద్దతు ప్రకటించింది. దీంతో ఎప్పుడూ లేనంతగా ఈ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకుంది. యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్ తరపున అధ్యక్ష బరిలో జగన్మోహన్ రావు, గుడ్ గవర్నెన్స్ ప్యానల్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్, క్రికెట్ ఫస్ట్ ఫ్యానల్ తరపున అధ్యక్షుడిగా శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ ప్యానల్ తరపున అధ్యక్షుడిగా అమర్నాథ్ పోటీ చేశారు. మరి ఎన్నికల ఫలితాల్లో ఏ ప్యానల్ విజయం సాధిస్తుందో చూడాలి.