- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్.. సీఎం అభినందనలు
దిశ, సిటీ బ్యూరో: సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ-హైదరాబాద్, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజులు స్పెషల్ డ్రైవ్ నేటితో పూర్తయింది. గాంధీ జయంతిన సీఎం రేవంత్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ డ్రైవ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈరోజు వరకు నగరంలోని ప్రాంతాల్లో నిర్విరామంగా డీ-సిల్టింగ్ పనులు నిర్వహించారు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ డ్రైవ్ ద్వారా 17,050 ప్రాంతాల్లో 2,200 కిలో మీటర్ల సీవరేజీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ పనులు పూర్తిచేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఫలితంగా రోజూ వచ్చే సీవరేజీ ఫిర్యాదులు 30 శాతానికి తగ్గాయి.
మరో 90 రోజులు..
90 రోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ డ్రైవ్‌ను మరో 90 రోజులు పొడిగించాలని ఆదేశించారు. ఇదే ఊపును రానున్న రోజుల్లో కొనసాగించి మిగిలిన పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నాటికి సీవరేజీ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు.
రోజూ వారీ పర్యవేక్షణకు డాష్ బోర్డ్..
స్పెషల్ డ్రైవ్ పనులను రోజూవారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశారు. సీవరేజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో నమోదు చేశారు. ఈ నమోదు ఒక్కో ప్రాంతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినవి, ఎన్నిసార్లు పరిష్కరించిన వివరాలను ఆ మ్యాప్‌లో ఒక బబుల్ (బుడగ)లా కనిపించేలాగా ఏర్పాటు చేశారు. వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను బట్టి.. ఆ బబుల్ పరిమాణం మారేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల సమస్య తీవ్రతను బట్టి దాన్ని పరిష్కరించారు.
ఇదే కాకుండా..
అలాగే ఈ డాష్ బోర్డును ఇప్పటి వరకు శుభ్రంచేసిన పైపు లైన్ల పొడవు, మ్యాన్ హోళ్ల సంఖ్య వివరాలు ఫొటోలతో సహా.. అప్‌లోడ్ చేసేలా రూపకల్పన చేశారు. సిల్ట్ కార్టింగ్ వాహనాలు తిరిగే ప్రాంతాలు జీపీఎస్ సహకారంతో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఎక్కడైనా కొత్త పైపులైన్ల నిర్మాణ ప్రతిపాదనను సైతం నమోదు చేసేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల రిపోర్టులను తయారు చేసి, వాటిని విశ్లేషించుకునే సౌకర్యం సైతం కల్పించారు.
మూడేళ్ల ఫిర్యాదుల విశ్లేషణ..
స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజీ ఫిర్యాదులను విశ్లేషించారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యలను గుర్తించారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టిసారించి పరిష్కరించారు.
సమిష్టి కృషితోనే ఫలితాలు: అశోక్ రెడ్డి, జలమండలి ఎండీ
అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయడంతోనే మంచి ఫలితాలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించాం. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావడంలో జలమండలి అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉంది. అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. ఈ డ్రైవ్ పై సీఎం నుంచి ప్రశంసలు రావడం హర్షణీయం. రాబోయే రోజుల్లో ఇంతకు మించి సామర్థ్యంతో కష్టపడతాం.