హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు

by Prasanna |
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు
X

దిశ, శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న కొండాపూర్ లోని ఆయన ఇంటి ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజాము నుంచే పోలీసులను మోహరించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మెన్ అరేకపూడి గాంధీతో పాటు పలువురు ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడం, గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్తానని ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుండి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకే కౌశిక్ రెడ్డిని ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అటు గాంధీ కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే నా ఇంటికి రా.. లేదంటే నేనే నీ ఇంటికి వస్తాను అంటూ సవాల్ విసిరారు.

Next Story

Most Viewed