Gold Robbery :హైదరాబాద్ లో భారీ దోపిడి

by M.Rajitha |
Gold Robbery :హైదరాబాద్ లో భారీ దోపిడి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో గురువారం భారీ దోపిడీ(Robbery) జరిగింది. దోమలగూడ(Domalguda)లోని అరవింద్ కాలనీలో దుండగులు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. రంజిత్ అనే బంగారు వ్యాపారి(Gold Murchant), అతని తమ్ముని ఇళ్లలోకి చొరబడి 2.5 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు. 10 మందికి పైగా దుండగులు కత్తులు, తుపాకీలతో ఒక్కసారిగా ఇళ్లలోకి చొచ్చుకొని రావడంతో ఇంట్లో వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. బంగారంతోపాటు మూడు ఖరీదైన ఫోన్లు, ఐ ట్యాబ్, సీసీటీవి డీవీఆర్ ను కూడా ఎత్తుకువెళ్ళినట్లు రంజిత్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనలో వ్యాపారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. 8 బృందాల సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed