- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది ప్రభుత్వ స్థలమంటూ బోర్డ్ పెట్టినా లెక్క చేయట్లే... అక్కడనే బిజినెస్ చేస్తున్న వైనం
దిశ, మియాపూర్: అక్కడ ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతి ఉన్నది. అయితే అక్కడ ఎవరైనా ఆ స్థలాన్ని ఆక్రమించినా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం అవి కనిపించలేదు. కనిపించినా సదరు వ్యక్తులు రూల్స్ గీల్స్ మాకు కాదు అనుకున్నారు.. అదే స్థలాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ టైల్స్ బిజినెస్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం విడ్డూరం. వివరాల్లోకి వెళితే మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ విశ్వనాథ గార్డెన్ కు ఎదురుగా కొంత ప్రభుత్వ స్థలం ఉన్నది. అదేచోట ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది అవి మాకేం పట్టనట్లు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును సైతం ఆక్రమించి మరి టైల్స్ బిజినెస్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులకు మాత్రం అవి కనిపించకపోవడం దురదృష్టకరమని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి..
ప్రభుత్వ స్థలాలు ఎక్కడ పడితే అక్కడ అన్యాక్రాంతం అవుతున్న సంగతి విధితమే. ఏండ్ల నాడు పాతిన ప్రభుత్వ సూచిక బోర్డుల ఆనవాళ్లు లేకుండా చేస్తున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. నేటి ప్రభుత్వ సూచిక బోర్డు తెల్లవారే సరికి నామ రూపాలేకుండా చేస్తున్న రోజులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాలకు రక్షణ ఎక్కడిది. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి సారించి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.