- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్తీ దవాఖానాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
దిశ, కూకట్పల్లి : పేద ప్రజలకు మంచి వైద్యం అందుబాటులో ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను పట్టించుకునే నాథుడు లేడని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మంచి వైద్యం అంబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలలో రోగులకు సేవలు అందడం లేదన్నారు. బస్తీ దవాఖానాలను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని ఆరోపించారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా 80 నుంచి 90 కాన్పులు జరిగేవని, ఇప్పుడు సంఖ్య తగ్గిందని అన్నారు. వైద్యులు సకాలంలో ఆసుపత్రికి రావడం లేదని, రోగులను పట్టించుకోక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విష జ్వరాలు ప్రబలుతున్న సమయంలో వైద్య సిబ్బంది సెలవులు పెట్టకుండా అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలని కోరారు. అదే విధంగా బస్తీ దవాఖానాలలో కావలసిన వసతులు కల్పించేందుకు తాను కృషి చేస్తానని, రోగులకు వైద్య సదుపాయలు కల్పించకపోతే చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.