- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి
దిశ, హిమాయత్ నగర్ : రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏడాదికి రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. యేసు క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి మార్గదర్శకమని ఆయన అన్నారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం రాత్రి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సారధ్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి బిషప్ లు, క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ .. విద్య, వైద్య రంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి క్రీస్తు ఏ విధంగా ఆదేశించారో ఆ ఆదేశాన్ని ఇందిరమ్మ రాజ్యం అనుసరిస్తుందని పేదల పక్షాన ఉంటుందన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ.. లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కులమత విద్వేషాలు పెరిగిపోయాయని ఆమె అన్నారు. శాంతిని స్థాపించుకోవడమే మన ముందున్న లక్ష్యం అని, ఏసుక్రీస్తు అవే బోధనలు చేశారని ఆమె గుర్తు చేశారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రేమ్ సాగర్ రావు లక్ష్మీ కాంతారావు, బ్రదర్ మోహన్ సి లాజరస్, తదితరులు పాల్గొన్నారు.