- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: న్యూ ఇయర్ వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: మెట్రో ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం రాత్రి మెట్రో రైలు సర్వీసుల సమయం పెంచుతున్నట్లు ప్రకటించారు. రేపు (ఆదివారం) అర్ధరాత్రి 12.15 గంటలకు వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో ఎండీ శ్రీధర్ తెలిపారు. స్టేషన్ నుండి చివరి రైలు 12.15 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. అర్ధరాత్రి ఒంటిగంటకు చివరి రైలు గమ్యస్థానానికి చేరుతుందని వివరాలు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వచ్చినా, మెట్రో సిబ్బందిపై, తోటి ప్రయాణికులపై దుర్భాషలాడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మెట్రో రైలు లోపల, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయాణికులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కాగా, ప్రస్తుతం మెట్రో సర్వీస్ రాత్రి 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. చివరి రైలు స్టేషన్ నుండి 11 గంటలకు బయలుదేరుతోంది.